పట్నం.. మస్తుగున్నదే.. | Hyderabad visit of tribals | Sakshi
Sakshi News home page

పట్నం.. మస్తుగున్నదే..

Jul 5 2017 2:09 AM | Updated on Sep 5 2017 3:12 PM

పట్నం.. మస్తుగున్నదే..

పట్నం.. మస్తుగున్నదే..

ఎన్నడూ గ్రామం నుంచి బయటకు రాని ఆదివాసీలు తొలిసారి హైదరాబాద్‌ మహానగరాన్ని చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు..

అదే చార్మినార్‌.. ఇదే గోల్కొండ..
అదిగదిగో అసెంబ్లీ.. అబ్బో..పట్నం మస్తుగున్నదే..

ఎన్నడూ గ్రామం నుంచి బయటకు రాని ఆదివాసీలు తొలిసారి హైదరాబాద్‌ మహానగరాన్ని చూసిన ఆనందంలో ఉబ్బితబ్బిబయ్యారు.. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ శివారులోని నాయకపుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీలు మంగళవారం నగరానికి వచ్చారు.   

ఒకప్పుడు నక్సల్స్‌ ప్రభావిత గ్రామమైన నాయకపుగూడెంలో సుమారు 850 మంది జనాభా ఉండేవారు.80% నిరక్ష్యరాస్యులే. అభివృద్ధి ఎరుగని ఈ మారుమూల గ్రామాన్ని జగిత్యాల ఎస్పీ అనంతశర్మ దత్తత తీసుకున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌కు వెళ్లని 35 మందిని ‘సందర్శన యాత్ర’పేరిట రాజధానికి తీసుకెళ్లారు. బస్సు వెంట వారికి రక్షణగా.. ఇద్దరు ఎస్సైలు.. పలువురు మహిళా, పురుష కానిస్టేబుళ్లను పంపారు. ఆదివాసీలు.. గోల్కొండ, చార్మినార్, అసెంబ్లీ, ట్యాంక్‌బండ్, హైటెక్‌ సిటీ, ఎయిర్‌పోర్టును చూసి ఆనందంతో పరవశించిపోయారు.  – సాక్షి, జగిత్యాల

నా కల నిజమైంది
అమాయక ఆదివాసీలు, గిరిజనులను హైదరాబాద్‌ తీసుకెళ్లి.. అక్కడి ముఖ్య మైన ప్రాంతాలు చూపించాలన్నది నా కల. ఇది ఈ రోజు నిజమైంది. ప్రభుత్వ సహకారంతో.. అటవీ గ్రామమైన జగన్నాథ్‌పూర్‌ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తా. గూడెంలోని గిరిజన మహిళలకు ఉచితంగా అల్లికల శిక్షణతోపాటు బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తా.    – ఎస్పీ అనంతశర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement