హుజుర్‌నగర్‌ ఉప ఎన్నిక; ఈసీ కీలక నిర్ణయం

Huzurnagar Bye Election: EC Transferred Suryapet SP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లుపై బదిలీ వేటు వేసింది. హెడ్‌క్వార్టర్‌లో రిపోర్ట్‌ చేయాలని, ఎన్నికల సంబంధించిన విధులు ఆయనకు కేటాయించవద్దని ఉన్నతాధికారులకు ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆర్‌. భాస్కరన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీగా నియమించింది. భాస్కరన్ ప్రస్తుతం భూపాలపల్లి ఎస్పీగా పనిచేస్తున్నారు.

హుజుర్‌నగర్‌లో గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం విశేషం. మంత్రులు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను అడ్డుపెట్టుకుని హుజుర్‌నగర్‌లో డబ్బు పంపిణీ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ గురువారం ఢిల్లీలో ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై పోలీసుల అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. (చదవండి: ‘హుజుర్‌నగర్‌’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top