‘హుజుర్‌నగర్’పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

సాక్షి, న్యూఢిల్లీ: హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, వివేక్, వీరేందర్ గౌడ్ గురువారం ఈమేరకు ఈసీ అధికారులను కలిశారు. ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు హుజుర్‌నగర్‌కు ప్రత్యేక పరిశీలకుడిని నియమించాలని ఈసీని కోరారు. రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసులు కలిసి అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
60 మంది సర్పంచ్‌లు నామినేషన్లు వేసేందుకు వస్తే సమయం లేదని నిరాకరించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు భూమన్నపై అక్రమ కేసులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందుకే సర్పంచ్‌లను నామినేషన్లను వేయకుండా అడ్డుకున్నారని, ఈ ఘటనలపై వెంటనే సీనియర్ అధికారులతో దర్యాప్తు జరిపి రిటర్నింగ్ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చదవండి: ఒక్క మహిళను ఓడించడానికి ఇన్ని కుట్రలా?)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి