హుజూరాబాద్ చిన్నారికి ప్రపంచ ఖ్యాతి | Huzurabad child to the world-famous | Sakshi
Sakshi News home page

హుజూరాబాద్ చిన్నారికి ప్రపంచ ఖ్యాతి

Jul 8 2015 1:28 AM | Updated on Apr 4 2019 3:25 PM

హుజూరాబాద్ చిన్నారికి  ప్రపంచ ఖ్యాతి - Sakshi

హుజూరాబాద్ చిన్నారికి ప్రపంచ ఖ్యాతి

అగ్రదేశం అమెరికాలోనూ హుజూరాబాద్‌కు చెందిన దివిటి సాత్విక ప్రతిభ చాటింది. అద్భుతమైన కవిత రచించి ప్రతిష్టాత్మక అమెరి

♦ అగ్రదేశం అమెరికాలో ప్రతిభ 
♦ వింత మనుషులపై కవిత రాసిన సాత్విక

 
 అగ్రదేశం అమెరికాలోనూ హుజూరాబాద్‌కు చెందిన దివిటి సాత్విక ప్రతిభ చాటింది. అద్భుతమైన కవిత రచించి ప్రతిష్టాత్మక అమెరికా లైబ్రరీ బుక్‌లో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన దివిటి శ్రీనివాస్ పదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. భార్య జ్యోతిర్మయితో కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. వీరి కూతురే సాత్విక(12). అక్కడి కనెక్టికట్ రాష్ట్రం ఫార్మింగ్‌టన్ వెస్ట్‌వుడ్ అప్పర్ ఎలిమెంటరీ పాఠశాలలో సాత్విక 7వ గ్రేడ్ విద్యనభ్యసిస్తోంది. ఇదిలా ఉండగా తన కవితను ప్రచురించిన పుస్తకం త్వరలో వెలువడనుంది.
 -హుజూరాబాద్
 
 కవిత్వంలో దిట్ట..
 సాత్వికకు తన చిన్నతనం నుంచే కవితలు అల్లడంపై ఆసక్తి ఎక్కువ. 3వ గ్రేడ్ నుంచే విభిన్నమైన అంశాలపై వ్యాఖ్యలు రాస్తుండేది. పద్యాలు, కవితలు రాయడంలో నేర్పరి. తాజాగా ‘అమెరికా లైబ్రరీ ఆఫ్ పోయెట్రీ’ కాంపిటీషన్‌కు తన కవితను పంపించింది. వింత మనుషుల గురించి వర్ణిస్తూ రాసిన కవితను సదరు నిర్వాహకులు ఎంపిక చేసినట్లు రాతపూర్వక ప్రశంసాపత్రాన్ని పంపించారు. అంతేగాకుండా అమెరికా లైబ్రరీ బుక్‌లో కవితను ప్రచురించడంతోపాటు నగదుపారితోషికం, ఎడిటర్స్ ఛాయిస్ అవార్డు, ఇతరాత్ర బహుమతులు అందించనున్నట్లు పేర్కొన్నారు. కవిత్వంతోపాటు పియానో, ఫ్లూట్, వయోలిన్ విద్య, కర్నాటక సంగీతం, స్విమ్మింగ్, ఐస్ స్కేటింగ్, టెన్నిస్‌లలో తనదైన ప్రతిభ చాటుతోంది. హుజూరాబాద్ వాసిగా అమెరికాలో అరుదైన ఘనత సాధించినందుకు  పట్టణానికి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ ఇలాసాగరం సుమతశ్రీనివాస్, వారి స్నేహితులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
 
 సాత్విక రచించిన కవిత తెలుగు అనువాదం..

 అలాంటి వింత ప్రజలు
 నేను ఆ మార్గాన్ని ప్రేమిస్తున్నాను
 వారు ఎప్పుడు ఏమీ జరగనట్టు వ్యవహరిస్తుంటారు
 ఏమీ చేయనట్లు వారి వైఖరి ఉంటుంది
 వారు ఒక భయానక చలనచిత్రం
 వారు బాధిస్తారు, వారి చేష్టలు బాధపెడతాయి
 కాని మీరు ప్రతీక్షణం వారితో గడపాలనుకుంటారు
 మరుక్షణంలో వారిలో  చిత్రమైన మార్పులు సంభవిస్తాయి
 వారు మనతో అపరిచితుల్లా వ్యవహరిస్తారు
 ఆ మరుక్షణం మనతో నవ్వుతారు,మనతో గుసగుసలాడుతారు
 ఇది విపరీత ధోరణి,
 ఇటువంటివారు మనల్ని అనేక విధాలుగా గాయపరుస్తారు
 నాకు వారి గురించి తెల్సుకోవడం ఎంతో ఆసక్తి
 వారు ప్రపంచాన్ని , తమను తమ అబద్దాలతో మోసగిస్తారు
 కావున నేను ఇటువంటివాళ్ల గురించి తెల్సుకోవడం వృధా అని అనుకుంటున్నాను.
 ఎందుకంటే నేను కూడా వాళ్లలో ఒకరిగా మారతాను కావచ్చు.
 నాకు వారి మీద ఎటువంటి భావాలు లేవు.
 నేను ఎవరినీ బాధపరచను
 నేను ఎప్పుడూ ఏడవను
  నేను ఇకముందు దిండు మధ్యలో నా ముఖం పెట్టి నా పసిబుగ్గలకు తడిని తాకనివ్వను.
 జంతువులు నా ప్రియనేస్తాలు కాదు
 అసత్యమనేది విలువలు మరియు, క్రమశిక్షణలపై పెత్తనం చెలాయిస్తూ నన్ను, నా  ప్రపంచాన్ని శాసిస్తోంది.
 వీటన్నింటికి ఒకేసారి ముగింపు పలుకుతాను.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement