మానవ అభివృద్ధి నివేదికపై కసరత్తు | human development report in telagana | Sakshi
Sakshi News home page

మానవ అభివృద్ధి నివేదికపై కసరత్తు

Jun 26 2014 2:24 AM | Updated on Sep 2 2017 9:23 AM

తెలంగాణలో మానవ అభివృద్ధి నివేదిక (హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్)ను సిద్ధం చేయాలని ప్రణాళికశాఖ నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మానవ అభివృద్ధి నివేదిక (హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్)ను సిద్ధం చేయాలని ప్రణాళికశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా, మండల, గ్రామస్థాయి వరకు పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ బాధ్యతను ఇప్పటికే సామాజిక, ఆర్థిక అధ్యయన కేంద్రం(సెస్)కు అప్పగించింది.

ఇప్పటికే ఈ పనిలో ఉన్న సెస్ మరో నెలరోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం 2014-15 సంవత్సర బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఈనెల 27వ తేదీన అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులు, విభాగాల అధిపతులకు దీనిపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement