బాపురావు గృహ నిర్బంధం అన్యాయం

House Arrest For Soyam Bapu Rao Is Unfair - Sakshi

ఆదివాసీ నాయకుల ఆందోళన

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

సాక్షి, ఆసిఫాబాద్‌: ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావును గృహ నిర్భందించడం అన్యాయమని ఆదివాసీలు, తుడుందెబ్బ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం కెరమెరి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ దిష్టిబొమ్మణు దహనం చేశా రు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసీ సమస్యల పరిష్కారం, ఆత్మీయ సభకు వెళ్తున్న ఎంపీ బాపూరావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హౌస్‌ అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమేనన్నారు.

ప్రభుత్వం లంబాడాలకు వత్తాసు పలుకుతుందని పేర్కొన్నారు. అనాథి నుంచి ఉంటున్న ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ప్రమా ణం స్వీకరాం చేసిన ఒక్క రోజులోనే సత్యవతి రాథోడ్‌ తన ప్రతాపాన్ని చూపుతున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ ఆందోళనలో నాయకులు కోవ విజయ్, భీంరావు, తుకారాం, ప్రభాకర్, దర్మూ, భీంరావు తదితరులున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top