హోంగార్డుల వేతనం రూ.12 వేలకు పెంపు! | home guards salary hiked, rs 9 thousand to 12 thousand! | Sakshi
Sakshi News home page

హోంగార్డుల వేతనం రూ.12 వేలకు పెంపు!

Dec 5 2014 2:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల వేతనాన్ని రూ. 9 వేల నుంచి 12 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల వేతనాన్ని రూ. 9 వేల నుంచి 12 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారిని కేసీఆర్ అభినందించారు.  దీనిలో భాగంగా హోంగార్డుల డిమాండ్ ల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేశారు.

 

పెంచిన హోంగార్డు జీతాలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటు వారికి మెడికల్ ఇన్సూరెన్స్, ఏడాదికి రెండు డ్రెస్ లు, జంట నగరాల పరిధిలో బస్ పాస్ లు ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement