నేడు, రేపు పలు జిల్లాల్లో వడగాడ్పులు  | High Temparature In Telangana | Sakshi
Sakshi News home page

Apr 22 2018 2:33 AM | Updated on Apr 22 2018 2:33 AM

High Temparature In Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అప్పుడే వడగాడ్పులు మొదలయ్యాయి. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement