జూనియర్ డాక్టర్ల సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది.
హైదరాబాద్ : జూనియర్ డాక్టర్ల సమ్మెపై గురువారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో ఉంచింది. మరోవైపు హైకోర్టు జూనియర్ డాక్టర్లకు మొట్టికాయలు వేసింది. కోర్టుకు రాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించింది. రాజకీయాలు చేస్తున్నారా? సమ్మె చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించింది. జూనియర్ డాక్టర్ల డిమాండ్లలో నాలుగింటిని అంగీకరించామని, వాటిపై జీవో కూడా జారీ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ సందర్భంగా కోర్టుకు విన్నవించారు.
జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు అందించాల్సిందేనని, సమ్మె రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కాగా వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూనియర్ డాక్టర్లు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే.