హైదరాబాద్ లో భారీ వర్షం | heavy rain hit hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో భారీ వర్షం

Nov 13 2014 1:47 AM | Updated on Aug 25 2018 4:06 PM

వర్షానికి మెహిదీపట్నం పీవీ ఎక్స్ ప్రెస్ వే కింద నిలిచి ఉన్న ప్రజలు - Sakshi

వర్షానికి మెహిదీపట్నం పీవీ ఎక్స్ ప్రెస్ వే కింద నిలిచి ఉన్న ప్రజలు

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది.

* స్తంభించిన ట్రాఫిక్.. నాలాలో పడి మహిళ మృతి

సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కిలోమీటర్ల మేర స్తంభిం చింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లలోకి చేరిన నీటిని తొలగించేందుకు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. రాత్రి 8.30 గంటల వరకు 4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది.

నాలాలో పడి మహిళ దుర్మరణం...
సికింద్రాబాద్ రెతి ఫైల్ బస్‌స్టేషన్ సమీపంలోని ఉప్పల్ బస్టాండ్ వద్దనున్న నాలాలో పడి బుధవారం రాత్రి ఓ మహిళ దుర్మరణం చెందింది. శామీర్‌పేట మండలం అలియాబాద్‌కు చెందిన సత్యవాణి(25) కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్‌లోని బంధువుల ఇంటికి వె ళ్లి వస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉప్పల్ బస్‌స్టాప్ వైపు వెళుతుండగా నీటి ఉద్ధృతికి నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. మృతురాలి భర్త సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement