ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు | Heavy rain batters Khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు

Jul 29 2014 9:26 AM | Updated on Sep 2 2017 11:04 AM

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది.

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రిజర్వాయర్లోని 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement