breaking news
Taliperu Reservoir
-
తాలిపేరుకు పోటెత్తిన వరద నీరు
ఖమ్మం : రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. దాదాపు అన్ని చెరువులు, కుంటల్లో నీరు ప్రమాదస్థాయికి చేరుకుంది. ఖమ్మం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బుధవారం ఉదయం ప్రాజెక్ట్ పదిగేట్లను ఎత్తివేసి... 23,730 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. -
ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రిజర్వాయర్‌లోని 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.