breaking news
batters
-
ప్రధాన సమస్య అదే.. ఐపీఎల్ స్టార్లంతా ఎక్కడికి పోయారు?
వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పవర్ ప్లే, స్లాగ్ ఓవర్లు పక్కకు పెడితే.. మిడిల్ ఓవర్లలో భారత్‌కు పరుగులు రావడం కష్టమైపోతుంది. ఒకప్పుడు జట్టులో ఆరో స్థానం వరకు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండేవారు. రాను రాను ఆ బాధ్యతలను ఆల్‌రౌండర్లతో పూడుస్తున్నారు. కానీ ఆల్రౌండర్లను పూర్తిగా నమ్మలేము. కచ్చితంగా ఒకరిద్దరు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఉండి తీరాల్సిందే. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మను మినహాయిస్తే ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టులో నిఖార్సైన స్పెషలిస్ట్ బ్యాటర్ కరువయ్యాడని చెప్పొచ్చు.మరి కోట్లు ఖర్చు పెట్టి ప్రతీఏటా ఘనంగా నిర్వహిస్తున్న ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వస్తున్న స్టార్ బ్యాటర్లంతా ఏమవుతున్నారు? ఐపీఎల్లో దంచికొట్టే రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురేల్, రింకూ సింగ్ వంటి అనుభం ఉన్న క్రికెటర్లను తరచూ ఎందుకు ఆడించడం లేదనేది ప్రశ్నగా మిగిలిపోయింది. బౌలింగ్‌లో చేస్తున్న మార్పులు బ్యాటింగ్‌లో ఎందుకు జరగడం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.రొటేషన్ పాలసీ గాలికి..ఐపీఎల్ పుణ్యమా అని పుట్టగొడుగుల్లా బ్యాటర్లు పుట్టుకురావడంతో జాతీయ జట్టులో ఎవరికీ అవకాశం ఇవ్వాలనేది కాస్త తలనొప్పి వ్యవహారమే అయినప్పటికీ, రొటేషన్ పాలసీ ద్వారా బ్యాటర్లను తరచూ మార్చుకునేందుకు వీలుంటుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు తరచూ రొటేషన్ పాలసీతోనే బ్యాటింగ్‌లో మార్పులు చేస్తూ వస్తున్నాయి. కానీ మన టీమిండియాకు వచ్చేసరికి మాత్రం ఒక సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తే అదే జట్టును వరుసగా ఆడిస్తూ వస్తున్నారు.వన్డే, టెస్టు క్రికెట్‌తో పోలిస్తే టీ20 క్రికెట్ వేరు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి కొట్టుడే పరమావధిగా బ్యాటర్లు ఉంటారు. నిలకడైన జట్టు ఉండాలనేది మంచిదే అయినప్పటికీ, అన్ని సందర్భాల్లో ఇది వర్తించదు. ఉదాహరణకు విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఓపెనర్లు ఎంత బాగా ఆడినా, మిడిలార్డర్ బలోపేతం లేకపోతే పరుగులు తగ్గిపోతాయి.బలహీనంగా మిడిలార్డర్..విండీస్‌తో జరిగిన గత మూడు మ్యాచ్‌లలో మధ్య ఓవర్లలో భారత్ ఆట గణనీయంగా మందగించింది. పవర్‌ప్లేలో వేగంగా ప్రారంభించినప్పటికీ, ఫీల్డింగ్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత వారి బౌండరీల వేట సామర్థ్యం దెబ్బతింది. ఈ స్వల్ప తగ్గుదలనే వెస్టిండీస్ తమకు అనుకూలంగా మలుచుకొని ఫలితాలు రాబట్టింది. రెండు, నాలుగో వన్డేల్లో మన వైఫల్యానికి కారణం మిడిలార్డర్ బలంగా లేకపోవడమే అని బల్లగుద్ది చెప్పొచ్చు.స్పెషలిస్ట్ బ్యాటర్ ఎక్కడ?ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మంది క్రికెటర్లు టీమిండియాలో ఆడాలని కలలు కంటుంటారు. అందరికీ కాకపోయినా, ఇప్పటికే తామేంటో నిరూపించుకున్న పటీదార్, పడిక్కల్, జురెల్, రుతురాజ్ వంటి స్పెషలిస్ట్ బ్యాటర్ల సేవలను ఉపయోగించుకుంటే బాగుంటుంది. వీళ్లందరికీ తలా ఒకటి లేదా రెండు మ్యాచ్‌ల్లో అవకాశాలు ఇస్తూ పోతే కీలక ప్లేయర్ గాయపడ్డా మన రిజర్వ్ బెంచ్ బలంగా ఉందన్న నమ్మకం ఉంటుంది.ఇదీ చదవండి: అతడి వయసు 29 ఏళ్లు.. 24 ఏళ్ల నిషేధం!‘కొత్తవాళ్ల మోజులో పడి ఆ టీ20 స్పెషలిస్ట్‌ను మరిచారా?’ -
వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై..
అహ్మదాబాద్: గుజరాత్ సహా ఉత్తర భారతదేశాన్ని వర్షాలు కొద్ది రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. జనజీవనం స్థంభించింది. నగరాలకు సైతం వరద తాకిడి ఎదురవుతుంటే ఇక అడవుల్లో వరదల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో అడవికి రారాజు సైతం వరదలతో ఇబ్బంది పడి.. అడవిని విడిచి రహదారిపైకి వచ్చేశాడు. గుజరాత్‌లోని జునాగఢ్‌ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కుంభవృష్టి సంభవిస్తోంది. దీంతో జునాగఢ్ సహా పరిసర నగరాల్లోని ప్రజలతో సహా అడవుల్లోని జంతువులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అడవికి రారాజుగా ఉండే సింహాలు సైతం అడవుల్లో ఉండలేక రోడ్లపైకి వస్తున్నాయి. ఓవైపు వర్షం వస్తున్నా.. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైకి వచ్చి వరదల తాకిడిని తప్పించుకుంటున్నాయి. వర్షంలో రోడ్డుపై సంచరిస్తున్న ఓ సింహం వీడియోను స్థానికులు షేర్ చేశారు. Gujarat is battered with incessant rains with flood like situation in many cities. Even, King of the Jungle is forced to relocate from it's habitat. Pray to God 🙏 for a speedy recovery and normalisation of the cities affected#GujaratRain #GujaratRains pic.twitter.com/5YORSAJnEN — Syed Saba Karim (@SyedSabaKarim5) July 23, 2023 ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 3000 వ్యూస్ వచ్చాయి. రాజుకు రాజ్యంలో స్థానం లేకుండా పోయిందని కొందరు కామెంట్ చేశారు. రాజ్యంలో బాధలను పర్యవేక్షించడానికి రాజు బయటకు వచ్చాడు అంటూ మరొకరు ఫన్నీగా స్పందించారు. గుజరాత్లో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 ఇదీ చదవండి: బైక్ నడుపుతూ ఇంటి చిరునామా మరిచిన వృద్ధుడు -
వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు వీళ్లే.. జాబితా విడుదల చేసిన ఐసీసీ
టీ20 వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్,స్ట్రయిక్ రేట్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే.. సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) స్ట్రయిక్ రేట్: 176.81 జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 163.65 ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 161.72 టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 160.08 గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 150.40 ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) స్ట్రయిక్ రేట్: 155.51 రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 152.87 ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 151.16 ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన టాప్-6 టీ20 బ్యాటర్లు వీరే.. హార్ధిక్ పాండ్యా దినేశ్ కార్తీక్ హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ మొయిన్ అలీ జోస్ బట్లర్ -
ఖమ్మం జిల్లాలో విస్తారంగా వర్షాలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని చింతూరులో అత్యధికంగా 17.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చర్ల మండలం తాలిపేరు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో రిజర్వాయర్‌లోని 17 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు.


