రేపట్నుంచీ మళ్లీ మంటలే.. | Heatwave to increse more | Sakshi
Sakshi News home page

రేపట్నుంచీ మళ్లీ మంటలే..

May 2 2017 2:00 AM | Updated on Sep 5 2017 10:08 AM

ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

నేడు అక్కడక్కడా వర్షాలు..
సాక్షి, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం కూడా రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం నుంచి పొడి వాతావరణం ఉంటుందని, దీంతో ఎండలు మండుతాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో వాతావరణం కాస్త చల్లబడింది. సాధారణం కంటే 2 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement