ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోమవారం నుంచి జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3200 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
నేటినుంచి 45 రోజులపాటు ప్రత్యేక క్యాంపులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోమవారం నుంచి జవహర్‌బాల ఆరోగ్య రక్ష పథకంలో భాగంగా వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 3200 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వైద్యబృందాలు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వైద్యపరీక్షలు చేస్తారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
చిలుకూరు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా చికిత్సలు అందిం చేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ముందడుగు వేసింది. ‘జవహర్‌బాలల ఆరోగ్య రక్ష’ పథకంలో భాగంగా ఈ నెల 15 నుంచి వచ్చే నెల 31వ తేదీ వరకు 45 రోజుల పాటు ప్రతి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
పాఠశాలల్లోనే పరీక్షలు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 3200 ప్రభుత్వ పాఠశాలల్లో 3.20లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికి ఆయా పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందు కోసం జిల్లాలోని 132 మంది వైద్యాధికారులతో పాటు కామినేని వైద్యకళాశాల నుంచి 60మంది వైద్యులను వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, సిబ్బంది షెడ్యూల్ ప్రకారం తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి వైద్య పరీక్షలు చేయనున్నారు. రోజుకు ఒక్కో వైద్యుడు 120 మంది విద్యార్థులకు పరీక్ష లు చేయాల్సి ఉంటుంది. కాగా విద్యార్థులకు సాధారణ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా మందులు పంపిణీ చేస్తారు. పరీక్షలకు సంబంధించిన వివరాలు ఆరోగ్య రక్ష కార్డులలో నమోదు చేస్తారు.