మానవత్వంలో దైవత్వాన్ని చూపించారు

Harish Rao Appreciate Doctors Humanity In Peddapalli Over Coronavirus - Sakshi

పెద్దపల్లికమాన్‌/సుల్తానాబాద్‌: జిల్లా కరోనా ప్రత్యేకాధికారి డాక్టర్‌ పెండ్యాల శ్రీరాంపై రాష్ట్రవ్యాప్తంగా నాయకులు, అ ధికారులు ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి హరీశ్‌రా వు సోమవారం ట్విట్టర్‌ ద్వారా ఆయనకు అభినందనలు తె లిపారు. కరోనాపై యుద్ధంలో స్ఫూర్తిదాయకంగా ని లి చారని, మానవత్వం బతికే ఉంది, మానవత్వంలో దైవత్వం దర్శించుకునేలా చేశారన్నారు. శ్రీరాం సేవలను తెలుసుకున్న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సైతం ప్రశంసించారు. జిల్లా అధికారులు సంఘం సభ్యులు  జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ రాజన్న, జిల్లా సహకారాధికారి చంద్ర ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి వినోద్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌లు అభినందించారు. (అన్నీ తామై ముందుకొచ్చారు)

మంత్రి హరీశ్‌రావు ట్వీట్‌ 

వైరస్‌ కారణంగా ఓ వ్యక్తి ఆదివారం మరణించగా అతడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి సిబ్బంది, ఇతర వ్యక్తులు ముందుకు రాకపోవడంతో మానవతా దృక్పథంతో డాక్టర్‌ శ్రీరాం స్పందించి, రోగి కుటుంబసభ్యుల సహకారంతో మున్సిపల్‌ ట్రాక్టర్‌ను స్వయంగా నడిపి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అపోహలను తొలగించారు. విపత్కర సమయంలో ప్రతీ మనిషి జాగ్రత్తలు పాటిస్తూ మరో మనిషికి తోడుండాలని జిల్లా అధికారుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు.  

కరోనాపై సమష్టి పోరు..
పెద్దపల్లికమాన్‌: జిల్లాలో వివిధ శాఖల అధికారుల సమన్వయంతో సమష్టిగా కరోనాపై పోరాడుతున్నాం. ఆదివారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలో ఓ రోగి దురదృష్టవశాత్తు మరణించాడు. కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాల తరలింపు కోసం ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రోటోకాల్‌ పాటిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ఆసుపత్రిలో మార్చురీ అంబులెన్స్‌ అందుబాటులో లేనందున మృతదేహం తరలింపు కోసం ఇతర వాహనాన్ని ఉపయోగించాం. మృతదేహం తరలింపులో శాఖల మధ్య సమన్వయ లోపం లేదు.

కరోనా సోకి మరణించినందున గ్రామంలో బంధువులు మరింత ఇబ్బందికి గురి కావద్దని, డ్రైవర్‌ రావడానికి సమయం పడుతుందని, కరోనాతో మృతదేహం తరలించే పక్షంలో ఇతరులకు ఇబ్బంది కలుగకుండా నేనే స్వయంగా శ్మశానవాటికకు తరలించా. కరోనా మృతుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్న. మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు పకడ్బందీగా చేస్తున్నారు. త్వరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్న. ప్రజలు అప్రమత్తంగా ఉండి స్వీయ నియంత్రణ పాటించి మహమ్మారిని తరిమి కొట్టాలని కోరుతున్న.
 – డాక్టర్‌ శ్రీరాం, జిల్లా సర్వేలెన్స్‌ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top