ప్రజల కష్టాలు తీర్చేందుకే.. | Sakshi
Sakshi News home page

ప్రజల కష్టాలు తీర్చేందుకే..

Published Mon, Dec 19 2016 2:23 AM

ప్రజల కష్టాలు తీర్చేందుకే.. - Sakshi

నగదు రహితంపై మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్య
సిద్దిపేట జోన్: ‘సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామం ఒక మారుమూల పల్లె.. సర్పంచ్‌ లక్ష్మి నిరక్షరాస్యురాలు. అయినా ఇంకుడు గుంతల ఆదర్శాన్ని ఢిల్లీలో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు వివరించింది. చదువు, సాం కేతికతో ఆమెకు సంబంధం లేకున్నా ఢిల్లీలో ప్రతిభ చూపింది. నగదు రహిత లావాదేవీలది మన ప్రయత్నం మాత్రమే. వంద శాతం ఇదే అని అనడం లేదు. క్యాష్, కార్డు రెండింటినీ వాడుకోవచ్చు. కానీ ఎప్పటికైనా కార్డుతోనే భవితవ్యం’ అంటూ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట లో పలు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని ఢిల్లీలో కూర్చుని కరెన్సీని రద్దు చేశారు. దీంతో ప్రజలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి.

బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా యాసంగి పెట్టుబడులు పెట్టలేక రైతులు, సరు కులు కొనలేక సామాన్యులు ఇబ్బందులు పడుతు న్నారు. ప్రజల కష్టాలను తీర్చే క్రమంలో ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను చేపట్టింది.  నచ్చిన వారు, విద్యావంతులు, యువకులు, ఉద్యోగులు కార్డును వాడు కోవాలి. గ్రామాల్లో వృద్ధులు, నిరక్షరాస్యులు పైసలను కూడా వాడుకోవచ్చు. కార్డు పెట్టి నీటిని పడుతున్న అనుభవం ఐదేళ్లుగా నియోజకవర్గ మహి ళలకు ఉంది. గ్రామాల్లో ప్రజలకు నిరక్షరాస్యులకు విశ్వాసం కలిగిస్తాం.  కొద్ది రోజులు నేర్చుకుంటే చాలు అందరికి ఇది సులభతరంగా మారుతుంది’ అని మంత్రి చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement