హజ్‌ దరఖాస్తుల గడువు పెంపు

Hajj application date extended - Sakshi

ఈ నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ

పాస్‌పోర్టు వ్యాలిడిటీ 2019 ఫిబ్రవరి వరకు  

సాక్షి, హైదరాబాద్‌: హజ్‌ యాత్ర (2018)కు వెళ్లే వారి నుంచి దరఖాస్తు స్వీకరణ గడువును రాష్ట్ర హజ్‌ కమిటీ పొడిగించింది. ఈ నెల 7 నుంచి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు హజ్‌ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌.ఎ.షుకూర్‌ గురువారం తెలిపా రు. దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని కేంద్ర హజ్‌ కమి టీని కోరడంతో గడువు పొడిగించినట్లు చెప్పారు. హజ్‌ యాత్ర కు దరఖాస్తులు చేసుకునే వారి పాస్‌పోర్టు వ్యాలిడిటీ 2019 ఫిబ్రవరి 14 వరకు ఉండాలని, లేనిపక్షంలో పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేయించుకోవాలన్నారు.

హజ్‌యాత్రకు వెళ్లే వారు దరఖాస్తు ఫారం పూర్తిచేసిన అనంతరం రూ.300 స్టేట్‌ బ్యాంక్‌ లేదా యూనియన్‌ బ్యాంక్‌ ద్వారా చలానా తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, అడ్రస్‌ సరిగా లేకుండా యాత్రకు వెళ్లే వారి బ్యాంక్‌ పాస్‌ బుక్, ఆధార్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ జిరాక్స్‌లను జత చేయాలన్నారు. గతంలో ఒక కవర్‌లో ఐదుగురు వెళ్లేందుకు అవకాశం ఉండేదని ఇప్పుడు నలుగురికే అవకాశం ఇచ్చామన్నారు. 70 ఏళ్లు పైబడి న రిజర్వేషన్‌ కేటగిరీ వారు ఒరిజినల్‌ పాస్‌పోర్టు దరఖాస్తును జమ చేయాల్సి ఉంటుందన్నారు. గ్రీన్, అజీజీయా 2 కేటగిరీలున్నాయని, ఏ కేటగిరీలో వెళ్లాలనుకుంటే ఆ కేటగిరీని పేర్కొనాలని, ఇప్పటివరకు 11 వేల దరఖాస్తులు అందాయన్నారు.

Back to Top