రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ | Granted to farmers for losses to natural disasters | Sakshi
Sakshi News home page

రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

Aug 12 2014 12:52 AM | Updated on Sep 2 2017 11:43 AM

రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ రూ.480.42 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు మంజూరు
 
హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు  సీఎం కేసీఆర్ రూ.480.42 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 2009-10 నుంచి 2014-15 వరకు రూ.404.58 కోట్లు, 2009 నుంచి 2013 వరకు రూ.75.84 కోట్లు మంజూర య్యాయి. విడుదలైన 90 రోజుల్లోగా  నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీని ద్వారా 26 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతుల  బకాయిల కింద మరో రూ. 9.5 కోట్లు విడుదల చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement