మద్దతు ధరకు మార్గాలివి.. | Grain purchased starts within one week | Sakshi
Sakshi News home page

మద్దతు ధరకు మార్గాలివి..

Nov 15 2014 4:05 AM | Updated on Aug 17 2018 2:53 PM

ఆరుగాలం శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి పంట పండించిన....

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఆరుగాలం శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి పంట పండించిన రైతుకు మార్కెట్‌లో మద్దతు ధర లభించకుండాపోతోంది. సేటు చెప్పిందే వేదమవుతోంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. అలా కాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ వివరించారు.

ఆ జాగ్రత్తలివి..
 జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా వేసిన వరి పంట చేతికస్తోంది. వారం రోజుల్లో ధాన్యం కొనుగో ళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేక 60 వేల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి కేవలం 20 వేల హెక్టార్లలోనే సాగైంది. నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగుకు సహసించారు.

చివరికి పంటకు నీటి తడులు అందక దిగుబడులు సగానికి తగ్గాయి. మార్కెట్ అధికారుల లెక్కల ప్రకారం 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. దీనికోసం ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ధాన్యం విక్రయించే రైతులు ఈ సూచనలు పాటిస్తే మద్దతు ధర వస్తుంది.  
 వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి
 వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసి వేయాలి
 కోతకు 15 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి
 1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు అగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి
 కోసిన వరి మెదలను నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి
 అనంతరం ఒక్కో రకం వరికి వేర్వేరు కల్లా లు ఏర్పాటు చేసి, టార్పాలిన్లలో వరి మెద లు వేసి ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేయాలి.
 ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరో రకం వరి ధాన్యంతో కల్టుపరాదు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి
 గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకాల సహాయంతో (తాలు గింజలు) నాణ్యత లేని గింజలు లేకుండా శుభ్రంగా తూర్పార పట్టాలి
 ఎగరబోసిన ధాన్యాన్ని 12 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి మార్కెట్ తీసుకువెళ్తే గిట్టుబాటు ధర వస్తుంది
 హార్వెస్టర్‌తో కోస్తే మొదటి సారి పోసే డ బ్బాను వేరుగా పోయాలి. ఆ తర్వాత కోసినవన్నీ ఒక చోట పోయాలి. ఇలా చేయడం ద్వారా కల్తీ ప్రమాదం తప్పుతుంది
 పంటను సిమెంట్ కల్లాలపై లేదా టార్పాలిన్ల షీట్లపై ఆరబెట్టాలి. రెండుమూడు రోజులు బాగా ఎండేలా కాళ్లతో కలియ దొబ్బాలి
 పంట కోశాక సరిగా ఆరబెట్టికపోతే గింజలు రంగుమారి, పంట నాణ్యత తగ్గే అవకాశం ఉంది
 పంటను అరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెళ్లలు, చె త్తాచెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి
 నిల్వ చేసే పక్షంలో గోనే సంచులను కింద వేయకుండా బల్లలు పరిచి వాటిపై బస్తాలు నెట్టుగా వేయాలి
 పురుగులు ఆశించకుండా లీటరు నీటికి 5 ఎంఎల్ మలాథియన్ మందు కలిపి బస్తాలపై పిచికారి చేయాలి
 ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల నెట్టుల మధ్య జింక్ పాస్ఫెట్ ట్యాబ్‌లెట్లు ఉంచాలి. ఒక రోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండాపోతాయి. మరుసటి రోజు నుంచి తలుపుల తీయవచ్చు.

 గ్రేడును బట్టి ధర
 వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం రూ.1400, సాధారణ రకానికి రూ.1360 మద్దతు ధర ప్రకటించింది. కనీస మద్దతు ధర దక్కాలంటే రైతులు ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
 మట్టి పెళ ్లలు, రాళ్లు, చెత్త, ఇతర ధాన్యపు గింజలు తదితరావి లేకుండా చూసుకొని క్వింటాల్ కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలి
 పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగులు తిన్న ధాన్యం 5 శాతం కంటే ఎక్కువగా ఉండాకుండా చూడాలి. ఈ పద్ధతులు పాటిస్తే పంటకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement