
ప్రతీ పేదబిడ్డకు ప్రభుత్వం అండ: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో ప్రతీ పేదబిడ్డకు ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతీ పేదబిడ్డకు ప్రభుత్వం అండగా ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. సచివాలయంలో గురువారం ఆరోగ్యలక్ష్మి, బాలామృతం పోస్టర్లను, అంగన్‌వాడీ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అంగన్‌వాడీలలో గర్భిణులు, పిల్లల హాజరుశాతం ఆశించినస్థాయిలో ఉండటం లేదన్నారు. గ్రామస్థాయి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రచారం చేస్తోందన్నారు. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.