గవర్నర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు  | Governor Tamilisai Soundararajan Bathukamma Wishes To People | Sakshi
Sakshi News home page

గవర్నర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు 

Sep 28 2019 3:43 AM | Updated on Sep 28 2019 8:23 AM

Governor Tamilisai Soundararajan Bathukamma Wishes To People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొమ్మిది రోజుల బతుకమ్మ పండగ శనివారం నుంచి ప్రారంభంకానున్న సందర్భంగా గవ ర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి మహిళలకు బతుకమ్మ పండుగ శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, నందివర్ధనం తదితర పూలను సేకరించి, విభిన్న రీతుల్లో అలంకరించే బతుకమ్మ.. రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అనుబంధం కలిగిన ప్రజలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, కోరికలు తీరాలని కోరుకునే పండుగ బతుకమ్మ. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’అని గవర్నర్‌ తన సందేశంలో పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement