గతేడాది నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీతో ఎంట్రీ హీరోయిన్ లయ. ప్రస్తుతం టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తోంది. ఈ ఏడాదిలో శివాజీ సరసన ఓ సినిమాలో కనిపించింది. కొన్నేళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమెరికా వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ రీ ఎంట్రీలోనూ అదరగొడుతోంది. ఏ పాత్ర వచ్చినా సరే వెండితెరపై అభిమానులను అలరిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన హీరోయిన్ తెలంగాణ వారసత్వాన్ని చాటుకుంది. బతుకమ్మ పండుగ అంటే పువ్వులు, స్త్రీతత్వం, తెలంగాణ అందమైన వారసత్వానికి ఒక వేడుక అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


