‘బోధన్ షుగర్స్’ను సర్కార్ స్వాధీనం చేసుకోవాలి | government should be to take over nizam deccan sugar factory | Sakshi
Sakshi News home page

‘బోధన్ షుగర్స్’ను సర్కార్ స్వాధీనం చేసుకోవాలి

Sep 26 2014 3:05 AM | Updated on Sep 2 2017 1:57 PM

బోధన్ నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం..

బోధన్ : బోధన్ నిజాం దక్కన్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు కార్మికులు, రైతులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలతో కలసి ఉద్యమిస్తామని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ అన్నారు.  షుగర్స్ మజ్ధూర్ సంఘ్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను  బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ,  మందకృష్ణ మాదిగ, బీఎంఎస్ నాయకులు ప్రారంభించారు.

 ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. 2001లో  టీడీపీ ప్రభుత్వం నిజాం చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటిం చిన తరుణంలో బోధన్‌లో ఓ బహిరంగ సభకు హాజరైన కేసీఆర్ ఫ్యాక్టరీ గేటు తాకినా తెలంగాణలోని లక్షలాది మంది కార్మికులతో   ఫ్యాక్టరీని ముట్టడిస్తామని అన్నారని గుర్తుచేశారు. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అవుతుంటే మాట్లాడలేదు ఎందుకని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమం, ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ తెలంగాణలోని నిజాం చక్కెర ఫ్యాక్టరీని అప్పనంగా ఆంధ్ర పెట్టుబడి దారులకు అప్పగించారని, దా నిని అధికారంలోకి వచ్చిన రెండు మాసాల్లోనే స్వా ధీనం చేసుకొని, పునర్ వైభవాన్ని తెప్పిస్తామని మా యమాటలు చెప్పారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిని దళితున్ని చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట మార్చి దళితులను మోసం చేశారన్నారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్‌కు వచ్చిన ఎంపీ కవిత ప్రజల సాక్షిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే మన ఫ్యాక్టరీని మనం తీసుకుందామని, తిరిగిమన పిల్లలకు ఉద్యోగాలు రప్పించుకుందామన్నారని తెలిపారు.

 ఫ్యాక్టరీ గేటు ముందు కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఫ్యాక్టరీని టేకోవర్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆయన ఫ్యాక్టరీ ఊసే ఎత్తడం లేదన్నారు.  ఫ్యాక్టరీ స్వాధీనానికి కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమంలో ప్రభుత్వం కుట్రలు పన్నితే ప్రజా ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. న్యాయపరమైన ఉద్యమాలు తప్పక విజయాన్ని సాధిస్తాయన్నారు.33 శాతం మహిళలకు కేటాయిస్తున్నామని ఉపన్యాసాలు ఇచ్చిన కేసీఆర్ తన కేబినెట్‌లో ఎంత మంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు.  జాయింట్ వెంచర్‌ను  రద్దు చేసి ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరకు సుదీర్ఘ పోరాటం సాగిస్తామన్నారు.  

 సభాసంఘం నివేదికను అమలు చేయాలి  - యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే
 ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీపై శాసన సభాసంఘం ఇచ్చిన నివేదికను ప్రభుత్వం త్వరిత గతిన అమలు చేసి కార్మికుల, రైతులను కాపాడాల్సి ఉందని నిజామాబాద్ అర్బన్ మాజీ  ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసి కార్మికులను రోడ్డు పడేశారని అన్నారు.

సీఎం కేసీఆర్ ఎన్‌డీఎస్‌ఎల్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని కార్మికులను, రైతులను ఆదుకోవాలన్నారు. ఫ్యాక్టరీ స్వాధీనానికి అడ్డంకులు ఉంటే అవి కార్మికుల, ప్రజల దృష్టికి తీసుకు రావాలన్నారు. రిలే దీక్షల్లో  షుగర్స్ మజ్ధూర్ సంఘ్ కార్మిదర్శి రాజయ్య, కార్మికులు జగదీశ్వర్‌రెడ్డి, అస్లాం, లక్ష్మీనారాయణ, గంగాధర్, ఇస్మాయిల్, సర్వర్ మక్దూమ్, లక్ష్మి, శోభ లు కూర్చున్నారు.
  కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్  నాయకులు  కొండా సాయిరెడ్డి, ఎంఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కిషన్‌జీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, బీజేపీ నాయకులు డాక్టర్ శివప్పా, సుభాష్, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, కౌన్సిలర్లు రామారాజు, ధర్మపురి, ఎమ్మార్పీఎస్ నాయకులు మానికోల్ల గంగాధర్, గందమాల చంద్రయ్య, గడ్డం రమేష్, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement