జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి | Give Accreditation Cards to all the journalist | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి

Dec 3 2016 1:46 AM | Updated on Oct 4 2018 8:34 PM

జీవో నంబర్ 239ను రద్దుచేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది.

తెలంగాణ జేఏసీ  

 సాక్షి, హైదరాబాద్: జీవో నంబర్ 239ను రద్దుచేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ప్రదీప్ చంద్రను కలసి వినతి సమర్పించారు.

14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచి ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితంలో మార్పు వస్తుందని ఆశపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస గుర్తింపు లేకుండా చూస్తుందని విమర్శించారు. జీవో నంబర్ 239ను రద్దుచేసి వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈనెల 5న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement