బాలిక కళ్ల వెంట నీళ్లు కాదు... రాళ్లు వస్తున్నాయి! | girl not getting tears | Sakshi
Sakshi News home page

బాలిక కళ్ల వెంట నీళ్లు కాదు... రాళ్లు వస్తున్నాయి!

Mar 7 2015 11:48 PM | Updated on Sep 2 2017 10:28 PM

బాధ, భావోద్వేగం, అమితానందం.. వీటిలో ఏ భావానికి లోనైనా... కళ్ల వెంట నీరు రావడం సర్వసాధారణం. కానీ, ఈ బాలిక కళ్ల నుంచి ఉన్నట్టుండి రాళ్లు బయటకు వస్తున్నాయి.

చెన్నూర్ రూరల్ (ఆదిలాబాద్): బాధ, భావోద్వేగం, అమితానందం.. వీటిలో ఏ భావానికి లోనైనా... కళ్ల వెంట నీరు రావడం సర్వసాధారణం. కానీ, ఈ బాలిక కళ్ల నుంచి ఉన్నట్టుండి రాళ్లు బయటకు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని కాచన్‌పల్లి గ్రామానికి స్వర్ణలత (8)కు గురువారం నుంచి రెండు కళ్లలోంచి రాళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు 30 రాళ్లు బయటకు వచ్చాయని బాలిక తల్లిదండ్రులు నరిగె సమ్మయ్య-సమ్మక్క తెలిపారు.

 

బాలికను సమీపంలోని అంగ్రాజ్‌పల్లి ప్రాథమిక ఆస్పత్రిలో చూపించగా... హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కూలీ పని చేసుకుని బతికే తాము బిడ్డను హైదరాబాద్ ఎలా తీసుకెళ్లేదని వారు ఆవేదన చెందుతున్నారు. కూతురు వైద్య చికిత్స కోసం దాతలు సహాయం అందించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement