మహారాష్ట్రలో గవిచర్ల వాసి మృతి | Gavicarla village person died in maharshtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో గవిచర్ల వాసి మృతి

Dec 20 2016 3:19 AM | Updated on Sep 4 2017 11:07 PM

మహారాష్ట్రలో గవిచర్ల వాసి మృతి

మహారాష్ట్రలో గవిచర్ల వాసి మృతి

రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు జీవి. అనారోగ్యానికి గురై ఒంటరిగా స్వగ్రామానికి తిరిగి వస్తూ మార్గమధ్యలో రైలులోనే తుది శ్వాస విడిచాడు.

స్వగ్రామానికి తీసుకుని రావడానికి ఆపన్నహస్తం కోసం నిరీక్షణ
సంగెం: రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు జీవి. అనారోగ్యానికి గురై ఒంటరిగా స్వగ్రామానికి తిరిగి వస్తూ మార్గమధ్యలో రైలులోనే తుది శ్వాస విడిచాడు.  మహారాష్ట్రలోని బూస్వాల్‌ రైల్వేస్టేషన్‌లోని శవాన్ని స్వగ్రామానికి తీసుకునిరావడానికి చేతిలో చిల్లి గవ్వలేక ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మం డలం గవిచర్లకు చెందిన అనుమాండ్ల సతీశ్‌(35) నిరుపేద. భార్య నర్మద, కుమార్తె లావణ్య(10) కుమారుడు రాజు(7), తల్లితండ్రులు ఉన్నారు. పొట్టకూటి కోసం సూరత్‌ వెళ్లి కూలి పనులు చేసేవాడు. అక్కడ అనారోగ్యానికి గురికాగా, తోటి కార్మికులు సోమవారం ఉదయం రైలు ఎక్కించి.. వరంగల్‌ పం పారు.

ఒంటరిగా రైలులో వస్తుండగా తీవ్రమైన అనారోగ్యంతో మహారాష్ట్రలోని బూస్వాల్‌ రైలు స్టేషన్‌లో సతీశ్‌ మృతి చెందాడు. రైల్వే పోలీసులు సతీశ్‌ శవాన్ని బూస్వాల్‌ రైల్వేస్టేషన్‌లో దింపివేశారు. సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేర వేశారు. భార్య నర్మద, తల్లితండ్రులు చంద్రమౌళి, ఎల్లమ్మల వద్ద శవాన్ని తీసుకొచ్చేం దుకు చిల్లగవ్వ కూడా లేదు. ఎవరైనా ఆదుకుంటే శవాన్ని స్వగ్రామానికి తీసుకుని వచ్చి దహన సంస్కారాలు చేయగలుగుతామని  విలపిస్తున్నారు.  దాతలు స్పందించి మృతుని భార్య నర్మద 81061 49253, మృతుని బంధువు శ్రీనివాస్‌ 94920 46102 నంబర్లలో సంప్రదించాలని బాధితులు వేడుకుంటున్నారు.  జిల్లా పద్మశాలి ఉద్యో గుల సంఘం తరఫున రూ.5 వేల ఆర్ధిక సహాయం అందించడానికి ఏర్పాట్లు చేశారు

Advertisement
 
Advertisement
Advertisement