గ్యాస్ సిలిండర్ పేలి ఏడు గుడిసెలు దగ్ధం | gas cylinder blast in bhupalpally | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి ఏడు గుడిసెలు దగ్ధం

May 14 2016 2:19 PM | Updated on Apr 3 2019 3:52 PM

వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో శనివారం ఉదయం సిలిండర్ పేలి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి.

వరంగల్ : వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామంలో శనివారం ఉదయం సిలిండర్ పేలి ఏడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. కల్పాల రవి అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. పక్కనున్న ఇళ్లకు మంటలు వ్యాపించి ఏడు ఇళ్లు కాలిపోయాయి. సదరు ఇళ్లలోని వారంతా ఈ రోజు ఉదయం తునికాకు సేకరణకు వెళ్లిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తికి చెందిన 5 గొర్రెలు కూడా చనిపోయాయి. ఇంట్లోని సామాగ్రి అంతా దగ్ధం కావడంతో ఏడు కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement