గణేష్‌ మండపంలో అగ్నిప్రమాదం | Ganesh idol Mandal Catches Fire In Malkajgiri | Sakshi
Sakshi News home page

గణేష్‌ మండపంలో అగ్నిప్రమాదం

Sep 4 2019 9:20 AM | Updated on Sep 4 2019 1:20 PM

Ganesh idol  Mandal Catches Fire In Malkajgiri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని మల్కాజ్‌గిరిలోని ఓ గణేష్‌ మండపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక విఫ్ణుపురి కాలనీలోని మైత్రీనివాస్‌ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో ఏర్పాటు చేసిన మండలంలో మంటలు చెలరేగడంతో రెండు కార్లు, పది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సహాయంతో మిగితా వాహనాలను అపార్ట్‌మెంట్‌ వాసులు బయటకు తీసుకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా  మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. కాగా ప్రాణ నష్టం తప్పడంతో అపార్ట్‌మెంట్‌ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement