జర్నీ.. క్యా కర్నా?

Full Demand on Train Reservations After Lockdown Hyderabad - Sakshi

అప్పుడే బుకింగ్‌.. ఆ వెంటనే కాన్సిలేషన్‌  

లాక్‌డౌన్‌ గడువుముగుస్తోందని ఆశాభావం       

రైల్వే రిజర్వేషన్లకు భారీగా పెరిగిన డిమాండ్‌

లాక్‌డౌన్‌ పొడిగింపునకే ప్రభుత్వాల మొగ్గు?

తాజా పరిణామాలతో ప్రయాణాలన్నీ రద్దు  

తెలుగురాష్ట్రాల్లో చిక్కుకుపోయినవారిలో ఆందోళన

సాక్షి, సిటీబ్యూరో: కరోనా కలవరం సృష్టిస్తోంది. అన్ని వర్గాల్లోనూ ఆందోళన రేపుతోంది. అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. మరికొద్ది రోజుల్లో లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారనే అంచనాలతో నగరవాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే వేళలో.. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు పలు కారణాలతో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఈ నెల 15న లాక్‌డౌన్‌ ముగిస్తే సొంత ఊళ్లకు వెళ్లవచ్చని ఆశించారు. ఈ మేరకు రైళ్లలో రిజర్వేషన్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగులకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. కానీ తాజాగా లాక్‌డౌన్‌ పొడిగింపునకే ప్రభుత్వం అనుకూలంగా ఉండడంతో  ప్రయాణికుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. మొన్నటిదాకా రిజర్వేషన్ల  బుకింగ్‌ కోసం ఎదురు చూసినవారు ప్రస్తుతం ప్రయాణాల రద్దు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలోనూ రైళ్ల రాకపోకలతో నిమిత్తం లేకుండా, రైల్వేతో  ఎలాంటి సమన్వయం లేకుండా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌లకు అవకాశం కల్పించడం కొంత గందరగోళానికి దారితీసింది.

డిమాండ్‌ అనూహ్యం..
‘లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే జనం హైదరాబాద్‌ వదిలి వెళ్లేందుకు పరుగులు పెడతారేమోనని రిజర్వేషన్లకు డిమాండ్‌ కనిపిస్తోంది’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ నెల 15 వరకు లాక్‌డౌన్‌ గడువు విధించడంతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూర్, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లే  రైళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. 16 నుంచి వారం రోజుల పాటు అన్ని రైళ్లలో ఏసీ, నాన్‌ ఏసీ బెర్తులకు బుకింగ్‌ పెరిగింది. కొన్ని రైళ్లలో  వెయిటింగ్‌ లిస్టు కనిపించింది. వివిధ కారణాలతో నగరంలో చిక్కుకొనిపోయిన వారు లేదా  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన వారు రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా డిమాండ్‌ కనిపించింది. మరోవైపు కొద్దిరోజుల పాటు లాక్‌డౌన్‌ తొలగించి తిరిగి మళ్లీ  విధించవచ్చనే వార్తల దృష్ట్యా కూడా చాలామంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కానీ లాక్‌డౌన్‌ పొడిగింపునకే  కేంద్రం, రాష్ట్రం సుముఖంగా ఉండటంతో ఇప్పుడు మరో గత్యంతరం లేక  ప్రయాణాల రద్దు కోసం ముందుకు వస్తున్నారు. మరోవైపు లాక్‌డౌన్‌పై  నెలకొన్న సందిగ్ధం ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. ‘లాక్‌డౌన్‌ పొడిగిస్తారో, తొలగిస్తారో  తెలియనప్పుడు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌లు అందుబాటులో ఉంచడం ఎందుకు’ అంటూ ప్రయాణికులు ఆందోళన వ్కక్తం చేస్తున్నారు.

ఎందుకీ గందరగోళం?
ఒకవైపు బుకింగులు, మరోవైపు రద్దుతో ప్రయాణాల రాకపోకలపై నెలకొన్న గందరగోళాన్ని  తొలగించేందుకు రైల్వేశాఖ కొంత మేరకు స్పష్టతనిచ్చింది. ‘కేంద్రం లాక్‌డౌన్‌ పొడిగిస్తే రైళ్లు నడిచేందుకు అవకాశం ఉండదు.లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఆన్‌లైన్‌ బుకింగులు లాక్‌డౌన్‌ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఓపెన్‌ చేసినవి కాదు’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ‘ప్రయాణికులు 3 నెలలు ముందే  బుక్‌ చేసుకొనేందుకు ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇది లాక్‌డౌన్‌ కోసం ఉద్దేశించింది కాదు’ అని పేర్కొన్నారు. 

వెంటనే రిఫండ్‌..
ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ ద్వారా రిజర్వేషన్‌లు బుక్‌ చేసుకున్నవారు తిరిగి తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటే నాలుగైదు రోజుల్లోనే రిఫండ్‌ వారి ఖాతాల్లో జమ అవుతుందని ఐఆర్‌సీటీసీ ఉన్నతాధికారి  సంజీవయ్య తెలిపారు. గత నాలుగైదు రోజులుగా బుక్‌ చేసుకున్న వారు లాక్‌డౌన్‌ పొడిగింపు వార్తల నేపథ్యంలో తిరిగి రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

23-11-2020
Nov 23, 2020, 03:24 IST
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ...
22-11-2020
Nov 22, 2020, 17:32 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1 ,121...
22-11-2020
Nov 22, 2020, 10:57 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌  ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలి దశలో కోవిడ్‌ సృష్టించిన విలయం...
22-11-2020
Nov 22, 2020, 10:07 IST
చికిత్స పొందుత్నువారిలో కొత్తగా 501 మంది ప్రాణాలు కోల్పోడంతో మొత్తం మరణాల సంఖ్య 1,33,227కు చేరింది.
22-11-2020
Nov 22, 2020, 08:18 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గం టీకా. ఇప్పటికే పలు కంపెనీలు టీకాలపై ప్రయోగాలు చేపట్టి చివరి...
22-11-2020
Nov 22, 2020, 08:07 IST
అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికాలో.. అంతకు ముందు నుంచే యూరోప్‌ దేశాల్లో.. దసరా, దీపావళి పండుగల తర్వాత భారత్‌లోనూ కరోనా...
22-11-2020
Nov 22, 2020, 04:48 IST
న్యూఢిల్లీ/రియాద్‌: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్‌ అని ప్రధాని మోదీ జీ20...
22-11-2020
Nov 22, 2020, 04:45 IST
ఆమె లాక్‌డౌన్‌ సమయంలో మహిళా పోలీసుల టాయ్‌లెట్‌ అవసరాలకు 20 వానిటీ వాన్‌లను స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. లాక్‌డౌన్‌ బాధిత...
21-11-2020
Nov 21, 2020, 16:14 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. యూరప్‌ దేశాల్లో సెకండ్‌ వేవ్‌ మొదలవడంతో ఫ్రాన్స్‌ వంటి దేశాలు...
21-11-2020
Nov 21, 2020, 14:13 IST
సిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి గురించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఇదేలా సాధ్యమయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యులందరితో...
21-11-2020
Nov 21, 2020, 11:14 IST
దుబాయ్‌: ఒక దొంగతనం కేసులో దుబాయి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.  ఫేస్‌ మాస్కులను ఎత్తుకుపోయిన గ్యాంగ్‌కు మూడేళ్ల జైలుశిక్ష, 1.5 దిర్హామ్‌ల...
21-11-2020
Nov 21, 2020, 10:54 IST
కొవిడ్‌ కారణంగా తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా సంస్థలు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం(ఇంటి నుంచే పని)...
21-11-2020
Nov 21, 2020, 10:21 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి....
21-11-2020
Nov 21, 2020, 09:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా  వైరస్‌ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా...
21-11-2020
Nov 21, 2020, 09:35 IST
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబాన్ని కరోనా వైరస్‌ వదలడం లేదు. అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్‌ దంపతులు...
21-11-2020
Nov 21, 2020, 09:15 IST
న్యూయార్క్: కోవిడ్-19 చికిత్సకు తొలి వ్యాక్సిన్ సిద్ధమైంది. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆధారంగా రూపొందించిన తమ వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి...
21-11-2020
Nov 21, 2020, 09:09 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల కన్నా డిశ్చార్జ్‌లే ఎక్కువగా ఉంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 952 కరోనా పాజిటివ్‌ కేసులు...
21-11-2020
Nov 21, 2020, 08:31 IST
సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్(యూఓహెచ్‌)‌లోని ఆస్పైర్‌ టీబీఐలో ఏర్పాటైన స్టార్టప్‌ కంపెనీ ఆప్టస్‌ థెరప్యూటిక్స్‌ కోవిడ్‌ చికిత్సకు ఉపయోగిస్తున్న...
21-11-2020
Nov 21, 2020, 03:49 IST
సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో కరోనా బాధితుల్లో చాలామంది మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి, నిరాశ...
20-11-2020
Nov 20, 2020, 14:50 IST
నిర్ధారణ పరీక్షలు చేయించుకునేలా ప్రజల్లో అవగాహన పెంచనుంది. దానికోసం 9525 బృందాలని ఏర్పాటు చేసింది. 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top