నాలుగు నెలల్లో నీటి కష్టాలకు చెక్! | Four months to check the water woes! | Sakshi
Sakshi News home page

నాలుగు నెలల్లో నీటి కష్టాలకు చెక్!

Jul 30 2015 11:35 PM | Updated on Mar 28 2018 11:08 AM

నాలుగు నెలల్లో  నీటి కష్టాలకు చెక్! - Sakshi

నాలుగు నెలల్లో నీటి కష్టాలకు చెక్!

తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మేడ్చల్ ప్రజలకు మరో నాలుగు దాహార్తి తీరనుంది

క్షేత్రగిరి గుట్టపై చురుగ్గా సాగుతున్న వాటర్‌గ్రిడ్ పనులు
గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్న శివారు ప్రాంతాలు
 
 మేడ్చల్ : తాగునీటి సమస్యతో సతమతమవుతున్న మేడ్చల్ ప్రజలకు మరో నాలుగు దాహార్తి తీరనుంది. ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పనులు చురుగ్గా సాగిస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్టు (హెచ్‌ఎండబ్ల్యుస్) చేపట్టిన సుజల స్రవంతి ప్రాజెక్ట్  పైపులైన్ నిర్మాణ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి వెంబడి పైపులైన్ వేసి మేడ్చల్ మండలం ఘనాపూర్ గ్రామ పరిధిలోని వెంకటేశ్వరస్వామి క్షేత్రగిరి గుట్టపై సంప్, రిజర్వాయర్ నిర్మాణాలను సర్కారు చేపట్టింది. 1500 లక్షల లీటర్ల సంప్, 27 లక్షల లీటర్ల సామర్థ్యం గల రిజర్వాయర్‌ను ఏడున్నర  ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నెల రోజుల్లో ట్రయల్ చేయనున్నట్లు సంస్థ ఇంజినీర్లు తెలిపారు. మొత్తం రూ.80 కోట్లవ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఆఖరు దశలో ఉంది.  

 నగరానికి గోదావరి జలాలు.
 క్షేత్రగిరిపై నిర్మిస్తున్న రిజర్వాయర్ నుంచి రెండు రింగుల ద్వారా హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేయనున్నారు. ఒక రింగు ద్వారా లింగంపల్లి, మరో రింగు ద్వారా మల్కాజిగిరి ప్రాంతాలకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్‌పేట్ మండలాల మీదుగా నీరు సరఫరా చేయనున్నారు.

 మేడ్చల్‌కు ప్రయోజనమిలా..
 క్షేత్రగిరి గుట్టపై నిర్మిస్తున్న వాటర్ గ్రిడ్ పైపులైన్ మేడ్చల్ మీదుగా లింగంపల్లికి వెళుతుం ది. లింగంపల్లికి వెళ్లే పైపులైన్ నుంచి  మేడ్చల్ పెద్ద చెరువులోకి గోదావరి జలాలు నింపడం వల్ల మేడ్చల్‌వాసుల నీటి కష్టాలు తీరుతాయి. మేడ్చల్ చెరువును మినీ రిజర్వాయర్‌గా మా ర్చనుండటంతో సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నాలుగు మండలాలకు నీటి సరఫ రా చేసే విధంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తారు.
 
 నాలుగునెలల్లో నీళ్ళందిస్తాం
 నగరానికి నాలుగు నెలల లోపు నీళ్లందిస్తాం. ప్రాజెక్ట్ నిర్మాణపనులు తుది దశలో ఉన్నాయి. లింగంపల్లి రిం గ్‌లో 7 కి.మీ., మల్కాజిగిరి రింగ్‌లో 8 కి.మీ. పైపులైన్ వేయాల్సి ఉంది. పనులు ప్రస్తుతం వేగిరం చేశాం.
 -సతీష్,  క్షేత్రగిరి వాటర్‌గ్రిడ్ సైట్ ఇంజినీర్
 
 నాలుగు మండలాలకు నీరందిస్తాం
 గోదావరి జలాలను నియోజకవర్గంలోని నాలుగు మం డలాలకు సరఫరా చేసే లా నిధులు మంజూరు చేసింది. క్షేత్రగిరి సంప్ నుంచి ఆ యా మండలాలకు వెళ్లే పైపులైన్ ద్వారా నీరు తీసుకుని ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించి గ్రామాలకు నీరు సరఫరా చేస్తాం.
 -సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement