పోలీసుల అదుపులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ 

Former TV9 CEO Ravi Prakash detained Banjara Hills Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను బంజారాహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏబీసీఎల్‌ కంపెనీ నుంచి రూ.12 కోట్ల నగదును రవిప్రకాశ్‌ అక్రమంగా వాడుకున్నారంటూ టీవీ9 ప్రస్తుత సీఈవో గొట్టిపాటి సింగారావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులను భారీగా పక్కదోవ పట్టించారనే ఫిర్యాదుతో రవిప్రకాశ్‌తో పాటు ఏబీసీఎల్‌ మాజీ సీఎఫ్‌వో ఎంకేవీఎన్‌ మూర్తిపై బంజరాహిల్స్‌ పోలీసులు 409,418,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

వి
రవిప్రకాశ్‌​​ మూడు విడతల్లో రూ.6కోట్ల 36 లక్షలు విత్‌ డ్రా చేశారు. అలాగే  డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎంకేవీఎన్‌ మూర్తిపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదైంది. ఆయన రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేయగా, మరో డైరెక్టర్‌ క్లిఫోర్డ్‌ పెరారీపైనా నిధుల విత్‌డ్రా కేసు నమోదు చేశారు పోలీసులు. పెరారీ రూ.5కోట్ల 97 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సమాచారం. అలందా షేర్‌ హోల్డర్లు, డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకుండా రవిప్రకాశ్‌ బృందం...భారీ మొత్తంలో కంపెనీ నగదును విత్‌ డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  తమకు తాము భారీగా బోనస్‌లు కూడా ప్రకటించుకున్నారు. ఏబీసీఎల్‌ కంపెనీని టేకోవర్‌ చేసిన అలందా మీడియా డైరెక్టర్లు ఈ ఏడాది సెప్టెంబర్‌ 24న సమావేశమై పక్కదారి పట్టిన నిధులపై బోర్డులో చర్చించారు. అనంతరం రవిప్రకాశ్‌ అండ్‌ కోపై క్రిమినల్‌ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top