మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అరెస్ట్ | former mla chirumarthi lingaiah arrested | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి అరెస్ట్

Aug 17 2015 2:55 PM | Updated on Aug 20 2018 4:27 PM

నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు అరెస్టు చేశారు.

రామన్నపేట: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తమ నియోజకవర్గానికి తాగు నీటి వసతి కల్పించాలనే డిమాండ్ తో సోమవారం చిరుమర్తి చేపట్టిన దీక్షను భగ్నం చేసిన రామన్నపేట పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

మూసీ నుంచి ధర్మారెడ్డి కాలువ ద్వారా నకిరేకల్ నియోజకవర్గంలోని మూడు మండలాలకు తాగు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో లింగయ్య.. రామన్నపేటలో ఒక్కరోజు దీక్షకు దిగారు. చిరుమర్తి అరెస్టుతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ లింగయ్య అనుచరులు పోలీసులపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement