పట్టాలిచ్చారు.. ఇళ్లు మరిచారు | Foot to the poor state of the unified homes | Sakshi
Sakshi News home page

పట్టాలిచ్చారు.. ఇళ్లు మరిచారు

Jan 21 2016 2:20 AM | Updated on Sep 3 2017 3:59 PM

జనగామ పట్టణంలోని బాణాపురంలో మూడవ విడత పట్టాలు అందుకున్న పేదలు రెండు పడకల ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.

సమైక్య రాష్ట్రంలో ఇళ్లకు నోచుకోని పేదలు
ఇప్పుడు ‘డబుల్’ కోసం ఎదురుచూపు
పట్టాల రద్దు యోచనతో
1200 మంది లబ్ధిదారుల్లో ఆందోళన

 
జనగామ : జనగామ పట్టణంలోని బాణాపురంలో మూడవ విడత పట్టాలు అందుకున్న పేదలు రెండు పడకల ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పట్టాలిచ్చిన ప్రభుత్వం.. ఇళ్లు మంజూరు చేయలేదు. నాడు మూడోవిడత ఇందిరమ్మ పథకానికి బ్రేక్ పడడంతో వారి ఆశలు అడియూశలయ్యూరుు. పట్టణంలోని ఆరు వార్డులకు చెందిన 1200 మంది లబ్ధిదారులకు బాణాపురంలో నివాసస్థలాలు కేటాయిస్తూ అప్ప ట్లో పట్టాలిచ్చారు. ఆర్డీవో స్థాయి అధికారులతో విచారణ చేపట్టి అర్హులను గుర్తిం చారు. అరుుతే వారికి మూడో విడతలో అవకాశం కల్పించకపోవడంతో సొంతింటి కల నిరాశగానే మిగిలింది. 40 నెలలుగా ఇళ్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఆందోళనలో లబ్ధిదారులు..
ఇళ్ల కోసం అధికారులకు మొర పెట్టుకుంటున్న తరుణంలో లబ్ధిదారులకు పిడుగులాంటి వార్త తెలిసి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. తాము ఇళ్లు నిర్మించుకోకపోవడంతో  పట్టాలు రద్దు చేస్తారేమోననే భయం వారిలో నెలకొంది. అంతేకాదు.. ఈ విషయంలో ఆందోళనకు సైతం సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన విష యం తెలిసిందే. ఈ విషయమై తహసీల్దార్ చెన్నయ్య మాట్లాడుతూ రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి బాణాపురంలో 24 ఎకరాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని చెప్పారు. కాగా, ఇళ్లు నిర్మించుకోని లబ్ధిదాల పట్టాలు రద్దుచేస్తారనే పుకార్లలో నిజం లేదని గృహనిర్మాణ శాఖ డీఈ దామోదర్‌రెడ్డి తెలిపారు.
 
అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయూలి

ఉమ్మడి రాష్ట్రంలో మా వార్డులో 110 మంది అర్హులను గుర్తించి, పట్టాలిచ్చారు. మూడవ విడుత ఇందిరమ్మ పథకాన్ని మధ్యలోనే నిలిపివేశారు. నాటి ప్రభుత్వం చేసిన తప్పుతో అర్హులైన వారు ఇళ్లు నిర్మించుకోలేక పోయారు. పేదల కోసం ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్.. వీరందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి.
 - ఆకుల రజని, 25 వార్డు కౌన్సిలర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement