కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు | floride areas more in karimnagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు

May 12 2015 1:11 AM | Updated on Mar 22 2019 6:13 PM

కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు - Sakshi

కరీంనగర్ లో 252 ఫ్లోరైడ్ ప్రాంతాలు

కరీంనగర్ జిల్లాలో 252 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు.

సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లాలో 252 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించామని కేంద్ర  మంత్రి బీరేంద్రసింగ్ తెలిపారు. సోమవారం రాజ్యసభలో ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఐఎంఐఎస్(ఇంటిగ్రేటెడ్ మ్యానేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం)ద్వారా 2012-13లో సేకరించిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాలో 252 ప్రాంతాల్లోని తాగునీటిలో మోతాదుకు మించి ఫ్లోరైడ్ అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. అయితే తాగునీటి సరఫరా అనేది ఆయా రాష్ట్రాల పరిధిలోని అంశమని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement