పెళ్లి బస్సులో మంటలు | fire accident in wedding bus | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సులో మంటలు

Nov 27 2017 12:39 PM | Updated on Sep 5 2018 9:47 PM

fire accident in wedding bus - Sakshi

బస్సు టైర్ల నుంచి వస్తున్న పొగలు

భువనగిరిఅర్బన్‌ : హైదరాబాద్‌ నుంచి భువనగిరికి వస్తున్న పెళ్లి బస్సులో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. డ్రైవర్‌ అప్రమత్తం కావడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన ఆదివారం భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరిలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో జరుగుతున్న ఓ వివాహనికి హైదరాబాద్‌ నుంచి కొంతమందితో పెళ్లిబస్సు భువనగిరికి చేరుకుంది.

స్థానిక జగదేవ్‌పూర్‌ చౌరస్తా వద్దకు రాగానే బస్సుకు చెందిన వెనుక టైర్ల నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై బస్సు దిగారు. డ్రైవర్, క్లీనర్‌ వెంటనే టైర్ల నుంచి పొగలు వస్తున్న ప్రాంతంలో నీటిని పోసి చల్లార్చారు. అనంతరం బస్సుకు మరమ్మతులు చేయడంతో అక్కడి నుంచి
వెళ్లిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement