మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం | Fire accident in Monda market in Secunderabad | Sakshi
Sakshi News home page

మోండా మార్కెట్లో అగ్నిప్రమాదం

Jul 29 2014 8:21 AM | Updated on Mar 22 2019 7:18 PM

సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ప్లాస్టిక్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి.

హైదరాబాద్: సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని ప్లాస్టిక్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దాంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది, నాలుగు ఫైరింజన్లతో హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement