పరకాల ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం | fire accident in itc godown in parkala warangal district | Sakshi
Sakshi News home page

పరకాల ఐటీసీ గోడౌన్లో అగ్నిప్రమాదం

Dec 25 2014 9:43 AM | Updated on Sep 5 2018 9:45 PM

వరంగల్ జిల్లా పరకాల ఐటీసీ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.

వరంగల్: వరంగల్ జిల్లా పరకాల ఐటీసీ గోడౌన్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement