కిరాణ షాపులో అగ్నిప్రమాదం | Fire Accident at a grocery store,Warangal | Sakshi
Sakshi News home page

కిరాణ షాపులో అగ్నిప్రమాదం

Nov 9 2018 10:41 AM | Updated on Nov 9 2018 11:35 AM

Fire Accident at a grocery store,Warangal - Sakshi

సాక్షి,గార్ల(ఇల్లందు): దీపావళి పండుగ వేడుకలు ఆనందంగా జరుపుకుని రాత్రి ఇంట్లో నిద్రించగా ముందున్న కిరాణ షాపులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలకేంద్రంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... గార్ల మండలకేంద్రంలోని మెయిన్‌ బజార్‌లో ఉన్న గోదా మహావీర్‌జైన్‌ కిరాణం షాపులో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు చెలరేగాయి.

దుకాణం వెనుకభాగంలో నివసిస్తున్న యజమాని లేని చూసి కేకలు వేయగా ఇరుగుపొరుగు వారు వచ్చి నీళ్లు తెచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మహబూబాబాద్‌ నుంచి ఫైరింజిన్‌ వచ్చి మంటలు ఆర్పేసింది. అప్పటికే దుకాణంలోని సరుకులు మొత్తం కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు. భవనం సైతం పూర్తిగా దెబ్బతిన్నది. ఫైరింజిన్‌ మరో 15 నిమిషాల ఆలస్యమై ఉంటే పక్క దుకాణాలకు సైతం మంటలు అంటుకుని పెనుప్రమాదం సంభవించేదని స్థానికులు పేర్కొంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement