8 నెలల చిన్నారిని హతమార్చిన తండ్రి | Father brutally kills 8 months Daughter in adilabad district | Sakshi
Sakshi News home page

8 నెలల చిన్నారిని హతమార్చిన తండ్రి

May 10 2015 7:23 PM | Updated on Sep 3 2017 1:48 AM

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో దారుణం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని తండ్రి కొట్టిచంపాడు.

ఆదిలాబాద్(నార్నూర్): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో దారుణం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని తండ్రి కొట్టిచంపాడు. ఈ విషయం ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. నార్నూర్ మండలంలోని బింజీగూడకు చెందిన భీంరావు, భీంబాయిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. పది రోజుల కిందట వీరిద్దరి మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా సొంత బిడ్డను తండ్రి బండకేసి మోది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అడివిలో పూడ్చేశాడు.

అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement