breaking news
brutally kills
-
ఎంత దారుణం.. ఇద్దరు పిల్లలను బావిలో పడేసి..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): మూర్ఖపు తండ్రి అనాలోచిత నిర్ణయానికి ఇద్దరు పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కలబురగి జిల్లా కమలాపుర తాలూకా గబ్బూరవాడి గ్రామంలో శరణప్ప అనే దివ్యాంగుడు పాన్ బీడా దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈయనకు కుమార్తె ప్రణతి(5), కుమారుడు శివకుమార్(3) ఉన్నారు. కొంతకాలంగా వ్యాపారం సరిగా జరగడం లేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. సోమవారం సాయంత్రం గ్రామంలోని అనంత లింగేశ్వర దేవాలయ బావిలోకి పిల్లలతో కలిసి దూకాడు. గమనించిన స్థానికులు బావిలోకి దిగి గాలించి ముగ్గురిని బయటకు తీశారు. అప్పటికే చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. శరణప్ప ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనపై కమలాపుర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: బాలికపై అఘాయిత్యం.. 80 ఏళ్ల వృద్ధుడితోపాటు.. మరో ఐదుగురు -
8 నెలల చిన్నారిని హతమార్చిన తండ్రి
ఆదిలాబాద్(నార్నూర్): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో దారుణం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారిని తండ్రి కొట్టిచంపాడు. ఈ విషయం ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. నార్నూర్ మండలంలోని బింజీగూడకు చెందిన భీంరావు, భీంబాయిలకు రెండేళ్ల కిందట వివాహమైంది. పది రోజుల కిందట వీరిద్దరి మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా సొంత బిడ్డను తండ్రి బండకేసి మోది చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని అడివిలో పూడ్చేశాడు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు చిన్నారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.