డిసెంబర్‌ 1 నుంచి అంతటా ‘ఫాస్టాగ్‌’

FASTag Mandatory From December 1st - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అన్ని టోల్‌గేట్ల వద్ద డిసెంబర్‌ 1 నుంచి ‘ఫాస్టాగ్‌’ అమలు చేయనున్నామని జాతీయ రహదారుల సంస్థ రీజినల్‌ అధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొన్నారు. తెలంగాణలోని 17 టోల్‌ప్లాజాల్లోనూ ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్‌ను అమర్చుతాం. ఈ టాగ్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు అనుసంధానం చేస్తాం. మొబైల్‌ వాలెట్‌ లేదా ప్రత్యేక కౌంటర్‌లలో ఫాస్టాగ్‌ను రీచార్జ్‌ చేసుకోవచ్చు.

దీనిద్వారా టోల్‌ప్లాజా దగ్గర బారులు తీరకుండా సులువుగా వెళ్లిపోవచ్చు. ట్రక్కులకు కూడా అనుసంధానం చేయడం వల్ల అది ఏ టోల్‌ప్లాజా దాటింది అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టోల్ ప్లాజాల దగ్గర నియమించిన ప్రత్యేక సిబ్బంది ద్వారా వాహనదారులకు ఈ విధానం గురించి అవగాహన కల్పిస్తున్నాం. వాహనదారుడు ఫాస్టాగ్‌ యాప్‌ ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు’ అని ఆయన తెలిపారు.
(చదవండి: ఐదు సెకన్లలో టోల్‌ దాటొచ్చు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top