కాళ్లరిగేలా తిరిగినా కనికరించలే.. దాంతో

Farmers Suicide Attempt Over Land Dispute At Bejjur In Komaram Bheem District - Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన తండ్రీకొడుకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బెజ్జూరు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. అధికారుల తీరుతో విసిగిపోయిన జనగాం ఫకీరా తన కొడుకుతో కలిసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. ఇద్దరినీ హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాలు.. బెజ్జూరు మండలం సలుగుపల్లి గ్రామంలో జనగాం ఫకీరా తండ్రికి 23 ఎకరాల ఆస్తి ఉండేది.

అయితే, తమ తండ్రి మరణానంతరం ఉమ్మడి ఆస్తిని తన అన్న ఒక్కడే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఫకీరా ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు ఎంతకూ స్పందించపోవడంతో ఫకీరా తన కుమారుడితో కలిసి గురువారం ఎమ్మార్వో ఆఫీసు వద్ద ధర్నాకు కూడా దిగాడు. అయినప్పటికీ అదికారులు పట్టించుకోక పోవటంతో తన కుమారుడితో కలిసి శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నం చేశాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top