పోలీసులు వేధిస్తున్నారు.. చర్యలు తీసుకోండి

Farmers Meet Human Rights To Solve Their Problems In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భూవివాదానికి సంబంధించి సంస్థాన్‌ నారాయణ్‌పూర్‌ పోలీసులు తమను వేధిస్తున్నారంటూ యాదాద్రి జిల్లా భువనగిరి మండలం జనగామకు చెందిన 15 మంది రైతులు శుక్రవారం మానవ హక్కుల కమీషన్‌ను ఆశ్రయించారు. అదే గ్రామానికి చెందిన నరేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో కుమ్మక్కైన చౌటుప్పల్‌ ఏసీపీ సత్తయ్య, ఎస్సై నాగరాజు, ఏఎస్సై శ్యామ్‌సుందర్‌రెడ్డిలు తమపై అక్రమ కేసులు బనాయించారని హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. భూమి సమస్యకు సంబంధించి అడ్డువస్తున్నామని తమపై 3 అక్రమ కేసులు బనాయించడమే కాకుండా విచక్షణారహితంగా కొట్టారని పేర్కొన్నారు. తమను వేధింపులకు గురి చేస్తున్న ఏసీపీతో పాటు ఇతర పోలీసులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని హెచ్‌ఆర్సీనీ రైతులు కోరారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top