విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer dies of electrocution | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 18 2015 7:25 PM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌లో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి దుంపల నారాయణ(58) అనే రైతు మృతిచెందాడు.

నిజామాబాద్ (ఎల్లారెడ్డి) : నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌లో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి దుంపల నారాయణ(58) అనే రైతు మృతిచెందాడు. తన పొలంలో మోటారు రిపేరు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం పొలానికి వెళ్లిన నారాయణ ఇంటికి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. నారాయణ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement