సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు | farmer complaint in NHRC against on circle inspector | Sakshi
Sakshi News home page

సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

May 17 2016 6:47 PM | Updated on Oct 1 2018 2:44 PM

సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు - Sakshi

సీఐ బెదిరింపులపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

తమ భూమిని బలవంతంగా తీసుకునేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది.

హైదరాబాద్: తమ భూమిని బలవంతంగా తీసుకునేందుకు సీఐ ప్రయత్నిస్తున్నారంటూ ఓ రైతు కుటుంబం హెచ్చార్సీని ఆశ్రయించింది.
సైబరాబాద్ సీపీ ఆనంద్ పేరు చెప్పుకుంటూ తమ 16 ఎకరాల భూమి విక్రయించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని రంగారెడ్డి జిల్లా యాచారం సీఐ మదన్‌మోహన్‌రెడ్డిపై పాల వెంకటయ్య అనే రైతు ఫిర్యాదు చేశాడు. సీఐ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన మానవహక్కుల కమిషన్ జూన్ 22 వ తేదీలోగా నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement