రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం మైలార్‌దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది.
వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం మైలార్‌దేవ్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది. అప్పులబాధతో దస్తప్ప(33) అనే రైతు గ్రామశివారున ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు రూ.3 లక్షల అప్పు అయినట్లు దస్తప్ప భార్య తెలిపింది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.