అప్పులబాధతో రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Nov 3 2015 6:24 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెబ్బన మండలం గోలేటి పంచాయతీ కైరిగూడ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.

రెబ్బన (ఆదిలాబాద్ జిల్లా) : అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెబ్బన మండలం గోలేటి పంచాయతీ కైరిగూడ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన గుగులోత్ వసంత్ రావు(40) అనే రైతు ఈ ఏడాది 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడి ఆశించినంతగా రాలేదు. సుమారు రూ.4 లక్షల మేర అప్పయింది. అప్పులు తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisement
 
Advertisement
Advertisement