అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Oct 3 2015 8:47 AM | Updated on Sep 29 2018 7:10 PM

అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా రాజాపేట మండలం నెమిల గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన కొత్త ఉప్పల్ రెడ్డి(48) తనకున్న మూడెకరాలతో పాటు మరో ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తిపంట సాగు చేస్తున్నాడు.

గతేడాది కూడా సరైన దిగుబడి రాకపోవడంతో.. అప్పులు భారీగా పెరిగిపోయాయి. శుక్రవారం పత్తింపంటకు మందుకొట్టాడు.. అదే సమయంలో ఎండిన పంటను చూసిన రైతు మనోవేదనకు గురై పంట చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement