కుటుంబ సర్వే వివరాలు పథకాలకు అనుసంధానం | Family survey linked to Welfare Schemes | Sakshi
Sakshi News home page

కుటుంబ సర్వే వివరాలు పథకాలకు అనుసంధానం

Sep 9 2014 4:28 PM | Updated on Sep 2 2017 1:07 PM

కుటుంబ సర్వే వివరాలు పథకాలకు అనుసంధానం

కుటుంబ సర్వే వివరాలు పథకాలకు అనుసంధానం

సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సంక్షేమ పథకాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  సమగ్ర కుటుంబ సర్వే వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాలలో కంప్యూటరైజేషన్‌ కార్యక్రమం పూర్తికావస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి)  పరిధిలో మాత్రం కంప్యూటరైజేషన్‌ మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కంప్యూటరైజేషన్‌ పూర్తి అయిన తరువాత పథకాలకు అనుసంధానం చేస్తారు.  రేషన్‌కార్డుల పంపిణీపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. జిహెచ్ఎంసి పరిధిలో సర్వే వివరాల కంప్యూటరీకరణ వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
**

Advertisement
 
Advertisement
Advertisement